97 మంది నేరగాళ్లను నిలబెట్టిన వైసీపీకి ఎవరైనా ఓటేస్తారా?: ఏపీ సీఎం చంద్రబాబు

07-04-2019 Sun 11:09 | Andhra
  • ఏపీలో సంపద సృష్టి, అమరావతి గురించి జగన్ చెప్పలేదు
  • 31 కేసులు ఉన్న జగన్ విదేశాలకు ఎలా వెళతారు?
  • జగన్ కు అసలు రాజకీయాల్లో ఉండే క్యారెక్టర్ ఉందా?
  • అమరావతిలో టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించడం గురించి వైసీపీ తన మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానంపై జగన్ మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్ కు ఏమాత్రం అవగాహన లేదని దుయ్యబట్టారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లాలంటే అన్ని అంశాలను పరిశీలిస్తారని, మరి 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. ఇన్ని నేరాలు, కేసులున్న వ్యక్తులను నమ్మి ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అని అడిగారు. ‘నేరాలు-ఘోరాలు పార్టీ’కి ఓటేస్తే జీవితాంతం క్షోభ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఉద్యోగానికి వెళితే వ్యక్తిత్వం, చదువులకు సర్టిఫికెట్ అడుగుతారనీ, మరి రాజకీయాల్లో ఉండేందుకు క్యారెక్టర్ సర్టిఫికెట్ జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. రూ.63,000 కోట్ల రాఫెల్ కుంభకోణానికి పాల్పడిన బీజేపీకి ఎవరైనా ఓటేస్తారా? అని అడిగారు. వైసీపీ 97 మంది నేరగాళ్లను ఈ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిందనీ, అలాంటి పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఈసారి టీడీపీ ఘనవిజయం సాధించనుందని జోస్యం చెప్పారు.
Andhra PradeshYSRCPJaganChandrababuTelugudesam

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more